కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి మెజారిటీకి నెట్టుకొచ్చే సీట్లు మాత్రమే గెలిచిందని ఎద్దేవా చేశారు.
మోడీ సర్కార్ చంద్రబాబు, నితీశ్‌ల అండతో నడుస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం, బిహార్‌లోని నితీశ్ సర్కార్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయమని ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, కేవలం భాగస్వామ్య పార్టీలు నిలబడగలిగే మద్దతుతోనే కొనసాగుతోందని ఖర్గే అభిప్రాయపడ్డారు.