---Advertisement---

దాడికి ప్ర‌తిదాడి.. తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ

దాడికి ప్ర‌తిదాడి.. తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ
---Advertisement---

నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం గాంధీ భవన్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ, వారి చర్యలకు తీవ్రంగా వ్యతిరేకంగా బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. ఈ నిరసనలో భాగంగా బీజేపీ నాయకులు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి, లోప‌లికి దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. గాంధీభ‌వ‌న్ మ‌ముందు ఏర్పాటు చేసిన క‌టౌట్లు, ఫ్లెక్సీల‌ను చించేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటన వల్ల నాంపల్లి ప్రాంతంలో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

ప్ర‌తిదాడి..
కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదురి చేసిన వ్యాఖ్యలను త‌ప్పుబ‌డుతూ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో కార్యాల‌యంపై దాడులు చేశారు. రమేష్‌ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో బీజేపీ శ్రేణులంతా ఏక‌మై గాంధీభ‌వ‌న్ ముట్ట‌డికి త‌ర‌లివ‌చ్చారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment