భారత్-పాక్ సరిహద్దుల్లో (India-Pakistan border) ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) విజయశాంతి (Vijayashanti) చేసిన ట్వీట్ (Tweet) రాజకీయంగా పెను చర్చకు దారి తీసింది. పాకిస్తాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ “భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొలుపుతున్న పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో మొదటి నుంచీ కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది. 1965లో మన సైన్యం పాక్ నడిబొడ్డు వరకూ చొచ్చుకెళ్లి కాంగ్రెస్ వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ (Lal Bahadur) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్‌ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ (Indira Gandhi) నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే” అని ఆమె ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ట్వీట్‌పై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ భద్రత, సైనిక చర్యల వంటి కీలక అంశాలపై రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. “సైనికుల త్యాగాలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉండగా, సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తరుణంలో రాజకీయ ప్రస్తావనలు అవసరమా..? అని కొందరు కామెంట్ల రూపంలో నిలదీస్తున్నారు. దుమారం రేపుతున్న ట్వీట్‌పై ఎమ్మెల్సీ విజయశాంతి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్‌ని కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి… pic.twitter.com/Y1aipP1Ojd
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 8, 2025