జ‌గ‌న్ ‘హాట్‌లైన్’ కామెంట్స్.. నిజం చేస్తున్న‌ కాంగ్రెస్

జ‌గ‌న్ 'హాట్‌లైన్' కామెంట్స్.. నిజం చేస్తున్న‌ కాంగ్రెస్

ఎల‌క్ష‌న్ టైమ్‌లో ఎన్డీయే కూట‌మిలో చేరిన చంద్ర‌బాబు.. ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీతో ట‌చ్‌లో ఉన్నాడ‌ని, రాహుల్ గాంధీతో హాట్ లైన్‌లో మాట్లాడుతున్నాడని ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ చేసిన కామెంట్స్‌ను కాంగ్రెస్ నిజం చేస్తోంది. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చేసిన విమ‌ర్శ కాదన్న అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. రాహుల్‌-చంద్ర‌బాబు మ‌ధ్య ర‌హ‌స్య దోస్తీ కొన‌సాగుతోంద‌ని తాజాగా కాంగ్రెస్ జాతీయ నేత‌లు చేస్తున్న కామెంట్స్ ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌, బిహార్ సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ – టీడీపీ మ‌ధ్య బంధం బ‌య‌ట‌ప‌డుతోంది. బీజేపీకి మ‌రో వెన్నుపోటు పొడిచేందుకు చంద్ర‌బాబు సిద్ధంగా ఉన్నాడ‌ని, గ‌తం కంటే ఈసారి కాస్త ఎర్లీగా ఉండొచ్చ‌ని జాతీయ కాంగ్రెస్ నేత‌లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

యూట‌ర్న్‌కు బాబు రెడీ – కాంగ్రెస్‌
బిహార్ ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం చంద్ర‌బాబు కాచుకొని కూర్చున్నాడ‌ని, బీజేపీ కూటమి ఓడిపోతే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వమే కూలిపోతుందని, ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీయే నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లంబా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని కాపాడుకోవడం కోసం విభిన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, బీహార్‌లో ఎదురయ్యే ఓటమి ఆ పార్టీపై గట్టి ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు. ఎన్డీయే గోడ దూకేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నాడ‌ని, బిహార్ రిజ‌ల్ట్స్ రిలీజే త‌రువాయి అన్న‌ట్లుగా లంబా ఆరోపించారు.

బీజేపీకి చెంప‌దెబ్బ – ప్రియా పురోహిత్‌
ఇక ఈ ఆరోపణలకు తోడు, బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్ ప్రియా పురోహిత్‌ సోషల్ మీడియాలో సంచలన పోస్టు చేశారు. “NDA లో వివాదం చెలరేగింది! ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి ప్రకటించిన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వొచ్చు. ఇది నిజంగా బీజేపీకి పెద్ద చెంపదెబ్బ” అంటూ ట్వీట్ చేయడం సంచ‌ల‌నంగా మారింది.

క‌నీస ఖండ‌న లేదంటే..
ఈ వ్యాఖ్యలు, ట్వీట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. క‌నీస ఖండన ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ కాక‌పోవ‌డం వెనుక కార‌ణాల‌ను వెతుకుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వైఎస్ జ‌గ‌న్ చెప్పినట్లుగానే హాట్‌లైన్‌లో ట‌చ్‌లో ఉండొచ్చ‌ని, 29 రాష్ట్రాల సీఎంల‌పై రాని, కాంగ్రెస్ చేయ‌ని ఆరోప‌ణ‌లు.. చంద్ర‌బాబుపైనే ఎందుకు చేస్తుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయం గురించి కాంగ్రెస్‌కు పూర్తిగా తెలుసు కాబ‌ట్టే జాతీయ నాయ‌క‌త్వం ఈ వ్యాఖ్య‌లు చేసిందంటున్నారు.

బాబు గ‌తం కూడా ఇదే..
2014లో విభ‌జిత ఏపీ వ్యాప్తంగా జ‌గ‌న్ మేనియా విప‌రీతంగా ఉంద‌ని గుర్తించిన చంద్ర‌బాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ-టీడీపీ పొత్తుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తిచ్చాడు. కేవ‌లం 0.5 శాతం ఓటింగ్‌తో వైసీపీపై నెగ్గిన చంద్ర‌బాబు నాలుగేళ్లు బీజేపీతో బాగానే ఉన్నా.. ఆఖ‌రి సంవ‌త్స‌రంలో మోడీ ప్ర‌భ ప‌డిపోతుంద‌ని భ్ర‌మ‌ప‌డి కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టాడు. అప్పుడు ఏర్పడిన అనుబంధం ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతోంద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మిలో చేరినా ర‌హ‌స్యంగా రాహుల్ గాంధీతో హాట్‌లైన్‌లో మంత‌నాలు జ‌రుగుతున్నాయ‌ని, ఏ టైమ్‌లోనైనా మ‌ళ్లీ బీజేపీకి వెన్నుపోటు త‌ప్ప‌ద‌ని కాంగ్రెస్ జాతీయ నాయ‌కుల్లో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోందనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment