---Advertisement---

రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు

రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు
---Advertisement---

రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరంఘర్ ఫ్లైఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు రేవంత్‌. ఈ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 4 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ ఆరంఘర్ నుంచి జూపార్క్ వరకు నిర్మించారు. ఫ్లైఓవ‌ర్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌.. హైదరాబాద్‌లో రెండు అతి పెద్ద ఫ్లైఓవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభం కావడం త‌నకు సంతోషంగా ఉంద‌న్నారు.

అతిభారీ ఫ్లైఓవర్‌లు ఇద్దరు ముఖ్యమైన నేతల పేర్లతో పిల‌వ‌బ‌డుతున్నాయ‌ని, మొదటి పెద్ద ఫ్లైఓవర్‌ను దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినప్పుడు, రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి అయి ప్రారంభం కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే అతిపెద్ద ఫ్లైఓవ‌ర్‌కు P.V. నర్సింహారావు పేరు పెట్టామ‌ని, మ‌రొక‌ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరును ఖ‌రారు చేయ‌డం సంతోషంగా ఉంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment