సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.. – ప్రధాని మోడీ కీలక ప్రకటన

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ.. - ప్రధాని మోడీ కీలక ప్రకటన

ప‌హ‌ల్గామ్‌ (Pahalgam)లో ఉగ్ర‌దాడి (Terrorist Attack) నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ (Narendra Modi) త‌న నివాసంలో వ‌రుస స‌మావేశాలు (Meetings) నిర్వ‌హిస్తున్నారు. వ‌రుస భేటీలతో ఉగ్ర‌వాదాన్ని (Terrorism) ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్‌ (Pakistan)పై ప్రతీకార చర్యలు ఉంటాయ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొద‌ట ర‌క్ష‌ణ శాఖ‌పై కీల‌క‌ స‌మీక్ష నిర్వ‌హించారు మోడీ. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ (General Anil Chauhan), త్రివిధ దళాధిపతులు (Tri-Forces Chiefs) తదితరులు పాల్గొన్నారు. ఈ స‌మావేశం అనంత‌రం హోంశాఖ‌తో ప్ర‌ధాని మోడీ భేటీ అయ్యారు. త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో జ‌రిగిన భేటీలో ప్ర‌ధాని మోడీ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మోడీ కీల‌క వ్యాఖ్య‌లు
పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. ఉగ్ర‌వాదాన్ని అంతం చేస్తామ‌న్నారు. సైన్యానికి (Army) స్వేచ్ఛ (Freedom) ఇచ్చామ‌ని ప్ర‌క‌టించారు. తేదీ, సమయం భారత సైన్యమే (Indian Army) డిసైడ్ చేస్తుందని, ఉగ్ర‌వాదుల‌కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందన్నారు. భారత సైన్యంపై ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌జ‌లంద‌రికీ పూర్తి నమ్మకం ఉందన్నారు. పహల్గామ్‌ దాడికి దీటైన జవాబు ఇస్తామ‌ని, ఉగ్రవాదాన్ని అంతం చేస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పహల్గామ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సైనిక చర్యల దిశగా ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

పాక్‌పై ప్రతీకార చర్యలు
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టుల్ని పాక్‌ ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంది. ఇందులో ప్రధానంగా సింధు జలాల ఒప్పందం రద్దు (Indus Waters Treaty), పాకిస్తానీయులకు వీసాలు (Pakistanis visas) రద్దు, అట్టారి వాఘా బోర్డర్ (Attari-Wagah Border) మూసివేయడం వంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇక భార‌త ప్ర‌భుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వ‌డంతో ఏ క్ష‌ణ‌మైనా ప్ర‌తీకార దాడులు జ‌ర‌ప‌వ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment