మాధవిలతపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఫిర్యాదు

మాధవిలతపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఫిర్యాదు

సినీనటీ, ఏపీ బీజేపీ నేత మాధవిలత (Madhavi Latha)పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao)కు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక (Shirdi Sai Devotees United Forum) ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై రామ చందర్ రావు మాట్లాడుతూ.. శిరిడి సాయి బాబాపై అనుచిత వాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. మనోభావాలు దెబ్బ తీయడం సరికాదు.. బాబాపై వాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. సాయి బాబాపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాధవీ లతకు సూచించారు.

సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్న వారికి శిరిడి సాయి బాబా ఐక్య వేదిక హెచ్చరికలు జారీ చేసింది. మంచికంటి ధనుంజయ (Manchikanti Dhanunjaya),శిరిడి సాయి భక్త ఐక్య వేదిక అధ్యక్షుడు మాట్లాడుతూ.. సాయి బాబాపై లేనిపోని మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆది సరికాదు.. సాయి బాబా ఆలయంలో జరిగేవి హిందూ పూజలే.. ఇంకేదో పూజలు కాదన్నారు. హిందువులను విడదీసే కుట్రలు చేయకండి.. బాబాను, బాబా భక్తులను హేళన చేయకండి అని కోరారు. హిందూ ధర్మాన్ని కూల్చే కుట్రలు చేయడం సరికాదు.. హిందూ బంధువులను చీల్చేందుకు కొంతమందికి నిధులు ఏమైనా వస్తున్నాయా..? అని ప్రశ్నించారు.

సాయి భక్తులు సహనంతో ఉన్నారు.. సహనం కోల్పోయేలా చేయొద్దన్నారు. మీరే హిందువులు అనే భ్రమలో ఉండకండి. కట్టర్ హిందువులు సాయి భక్తులు.. సాయి బాబాను హేళన చేసిన దాంట్లో 14 మంది మీదా కేసులు పెట్టామన్నారు. మాధవీలత, భరత్ వర్ష (Bharat Varsha), లలిత్ కుమార్ (Lalith Kumar) లు సాయి బాబాను హేళన చేయడంలో కీలకంగా ఉన్నారని తెలిపారు. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులను కలవడం జరిగింది చర్యలు తీసుకొమ్మని కోరామని తెలిపారు. సహనంతో ఉన్నాం, రెచ్చగొట్టకండి అని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment