రేపు తిరుమ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

రేపు తిరుమ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరుమల తిరుపతిని సందర్శించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శించుకోనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఇప్పటికే టీటీడీ అధికారులు పటిష్ట‌ చర్యలు చేపట్టారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అత్యంత అంగరంగ వైభవంగా అలంకరించారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాత్రి తొక్కిసలాట..
నిన్న రాత్రి తొక్కిసలాట జరిగిన నేపథ్యంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. భ‌క్తుల భ‌ద్ర‌త కోసం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ స‌మేతంగా శ్రీ‌వారి దర్శనానికి రాగానే భక్తులకు అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment