తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు అత్యవసర సమావేశాన్ని (Emergency Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తికరంగా, ఈ భేటీకి అధికారులను కాకుండా కేవలం మంత్రులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. కేవలం మంత్రులు మాత్రమే హాజరవుతున్నారంటే.. ఈ భేటీలో రాజకీయ పరమైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ వర్గాల్లో ఈ సమావేశంపై భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, ఇది ఓ కీలక నిర్ణయానికి ముహూర్తమా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.








