మేడారం జాతరకు జాతీయ గుర్తింపు కావాలి.. సీఎం రేవంత్

మేడారం కు జాతీయ హోదా గుర్తింపు ఇవ్వాలి:సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లాలోని మేడారం మహాజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీల అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ ఆలయ పురోగతిపై కీలక ప్రసంగం చేశారు. ఆలయ అభివృద్ధి ఒక భావోద్వేగంతో కూడిన బాధ్యత అని ఆయన అన్నారు. సమ్మక్క సారలమ్మల ఆశీస్సులతోనే తాను పాదయాత్ర ప్రారంభించానని, తెలంగాణకు పట్టిన సమస్యలను తొలగించడానికి 2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డపై నుంచే అడుగులు వేశామని గుర్తు చేసుకున్నారు.

ఆదివాసీల సంక్షేమానికి ప్రాధాన్యం

ఆదివాసీలు దేశానికి మూలవాసులని పేర్కొంటూ, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఏ సంక్షేమ పథకం అయినా ఆదివాసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నామని చెప్పారు. సమ్మక్క సారలమ్మల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణం తమ ప్రభుత్వానికి ఒక గొప్ప ఘట్టమని, ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు, పూజారులు, సంప్రదాయ కుటుంబాలందరినీ భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.

కేంద్రంపై విమర్శలు

రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయని, ఆలయ నిర్మాణంలో వాటికే ప్రాధాన్యత ఇస్తామని సీఎం తెలిపారు. మహాజాతర కంటే ముందే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్నప్పటికీ, ఆదివాసీ కుంభమేళా అయిన మేడారం జాతరకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు, నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు. మహాజాతర సమయంలో తిరిగి వచ్చి, ఈ జాతరను మరింత ఘనంగా నిర్వహిస్తామని భక్తులకు హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment