సీఎం నెల్లూరు పర్యటనలో విషాదం…. ఒక‌రు మృతి

సీఎం నెల్లూరు పర్యటనలో అప‌శృతులు.. ఒక‌రు మృతి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇవాళ నెల్లూరు జిల్లా (Nellore district) ఆత్మకూరు ప్రాంతంలో పర్యటించారు. 1వ తేదీ కావ‌డంతో ప్ర‌తినెల లాగే ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వ‌చ్చి టీ చేసి, పెన్ష‌న్ (Pension) డ‌బ్బులు వారికి అందించారు. అయితే సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న రెండు విషాద‌క‌ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోగా, టీడీపీ (TDP) అభిమాని ఒక‌రు దుర్మ‌ర‌ణం చెందారు.

ఆగిన అభిమాని గుండె
సీఎం చంద్ర‌బాబు వ‌స్తున్నార‌ని తెలిసి హెలిప్యాడ్ వద్దకు టీడీపీ అభిమాని వెంకటేశ్వర్లు (TDP Supporter Venkateswarlu) వ‌చ్చారు. ఎండ‌లో సీఎం కోసం ఎదురుచూస్తూనే ఆయ‌న‌ ఆకస్మికంగా సృహ తప్పి కిందపడిపోయారు. చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే స్పందించి అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి (Local Government Hospital) తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆస్ప‌త్రికి తరలిస్తుండగా సీఎం ప‌ర్య‌ట‌న కావ‌డంతో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, వాహ‌నాల రాక‌పోక‌ల‌కు స్వ‌ల్ప అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో ఆయ‌న మార్గ‌మ‌ధ్య‌లోనే ఆయన మృతిచెందారు. పరిస్థితి వల్ల అక్కడ సందడి క్షణాల్లోనే విషాదంగా మారిపోయింది. వెంక‌టేశ్వ‌ర్లు మరణం కుటుంబ సభ్యుల‌ను అనాథ‌లుగా మార్చింది.

కుప్ప‌కూలిన ఆర్చి..
సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో ప్రజలకు తప్పిన పెనుప్రమాదం త‌ప్పింది. నారంపేట (Narampet) ఎంఎస్ఎంఈ పార్క్ (MSME Park) వ‌ద్ద ప్ర‌జావేదిక (Public stage) స‌మీపంలో సీఎం చంద్ర‌బాబు కోసం అధికారులు ఆర్చి (Arch) ఏర్పాటు చేశారు. ఆర్చి ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. అప్పటికే చంద్రబాబు, ప్రజలు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం త‌ప్పింది. ప్రజా వేదిక వద్ద ఉదయమే ఏర్పాటు చేసిన ఆర్చి, సాయంత్రం కల్లా కుప్పకూలడంపై ప్రజలు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం త‌ప్పింద‌ని స‌భ నిర్వాహ‌కులు ఊపిరి పీల్చుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment