సీఎం పింఛ‌న్ల పంపిణీ.. ఈ నెల బాప‌ట్ల జిల్లాలో…

సీఎం పింఛ‌న్ల పంపిణీ.. ఈ విడ‌త‌ బాప‌ట్ల‌లో..

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) ఇవాళ బాప‌ట్ల జిల్లా (Bapatla District)లో ప‌ర్య‌టించ‌నున్నారు. సామాజిక పింఛ‌న్ల పంపిణీలో భాగంగా బాప‌ట్ల జిల్లా ప‌రిధిలోని కొత్త గొల్ల‌పాలెం (Kotta Gollapalem) లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. కొత్త గొల్ల‌పాలెంలో ల‌బ్ధిదారుల‌కు ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్లు (NTR Bharosa Pensions) పంపిణీ చేస్తారు. ప్ర‌తి నెలా 1వ తేదీన ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి సీఎం చంద్ర‌బాబు పింఛ‌న్లు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. సీఎం బాప‌ట్ల జిల్లా ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను మంత్రులు కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathi), గొట్టిపాటి ర‌వి (Gottipati Ravi), అనగాని స‌త్య‌ప్ర‌సాద్ (Anagani Satyaprasad) ప‌రిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment