2025 సంక్రాంతిలోపే రాష్ట్రంలోని రహదారులను (Roads) అద్దంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల్లో ప్రామిస్ చేసిన కూటమి ప్రభుత్వం (Alliance Government).. రెండేళ్లు పూర్తికావొస్తున్నా.. ఇంకా రహదారుల నిర్మాణాలపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో రహదారులు అండ్ భవనాలు (Roads & Buildings Department), రవాణా శాఖలపై (Transport Department) నిర్వహించిన సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా “గుంతలు లేని రహదారుల” (Pothole Free Roads) నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు.
45 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్వహణే ప్రాధాన్యత
రాష్ట్రంలో ఉన్న సుమారు 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం రోడ్లు వేయడమే కాకుండా, వాటి మన్నికపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులను బట్టి, నేల స్వభావాన్ని అధ్యయనం చేసి దానికి అనుగుణంగా రహదారుల నిర్మాణం జరగాలని సీఎం ఆదేశించారు. మెరుగైన రహదారులు ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని, ప్రజలకు మౌలిక సదుపాయాలు వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
రవాణా రంగంలో ‘ఈవీ’ విప్లవం
ప్రజా రవాణాను సామాన్యుడికి మరింత చేరువ చేసేందుకు అతి తక్కువ వ్యయంతో ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బస్సులను (EV Buses) భారీగా అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాలుష్య నివారణతో పాటు ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గేలా ఈవీ బస్సుల వినియోగాన్ని పెంచాలని సూచించారు.







