సీఎం అధ్య‌క్ష‌త‌న‌ కలెక్టర్ల సదస్సు ప్రారంభం.. ఏం చ‌ర్చిస్తారంటే..

సీఎం అధ్య‌క్ష‌త‌న‌ కలెక్టర్ల సదస్సు ప్రారంభం.. ఏం చ‌ర్చిస్తారంటే..

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. జిల్లాల అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ పథకాల అమలు స్థితిగతులపై సీఎం సమీక్ష చేపట్టారు.

సమావేశంలో ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, అభివృద్ధికి సంబంధించిన పది సూత్రాలు, అలాగే స్వచ్చాంధ్ర కార్యక్రమం మరియు రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి లక్ష్యాలు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. జిల్లాల స్థాయిలో విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలను కలెక్టర్లు సీఎంకు వివరించారు.

అదేవిధంగా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులు, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం, ఆధునిక విధానాల అమలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. పరిపాలనను వేగవంతంగా మార్చేందుకు సాంకేతిక వ్యవస్థలను ఎలా వినియోగించాలనే దానిపై అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై జిల్లాల వారీగా సమీక్ష జరిపారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల పరిపాలనను మరింత సమర్థవంతంగా నడిపించేందుకు సీఎం కీలక మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment