నేడు కోనసీమకు సీఎం.. చెట్లు న‌రికివేత‌పై విమ‌ర్శ‌లు

నేడు కోనసీమకు సీఎం.. చెట్లు న‌రికివేత‌పై విమ‌ర్శ‌లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ (Dr. B.R. Ambedkar Konaseema) జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముమ్మిడివరం మండలంలోని చెయ్యేరు గ్రామాన్ని (Cheyyeru Village) సందర్శించనున్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో (Pensions Distribution Program) పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతికి పెన్షన్లు అందించనున్నారు. పీ4 (P4) కార్యక్రమంలో భాగంగా, జిల్లా వ్యాప్తంగా ఎంపికైన బంగారు కుటుంబాలను ముఖ్యమంత్రి క‌ల‌వ‌నున్నారు.

చెట్లు న‌రికివేత‌పై విమ‌ర్శ‌లు
ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గం (Mummidivaram Constituency) కాట్రేనికోన మండ‌లం చెయ్యేరులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల‌ను (Trees) న‌రికివేశారు. సీఎం ప‌ర్య‌ట‌న‌కు మూడు రోజుల ముందే చెట్ల న‌రికివేత కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లుగా స‌మాచారం. కాగా, చెట్ల న‌రికివేత వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) వివ‌ర‌ణ ఇచ్చింది.

తీగ‌ల కోసం మొద‌ళ్లు న‌రికేస్తారా..?
విద్యుత్ తీగ‌లు త‌గ‌ల‌కుండా చెట్ల‌ను న‌రికివేశామ‌ని టీడీపీ చెబుతున్న‌ప్ప‌టికీ.. కౌంటర్లు మాత్రం ఆగ‌డం లేదు. విద్యుత్ తీగ‌ల కోసం అయితే చెట్ల కొమ్మ‌లు న‌రికితే స‌రిపోతుంది క‌దా.. చెట్టు మొద‌లు వ‌ర‌కు న‌రుకుతారా..? అని లాజిక్‌తో ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భాల్లో హ‌డావిడి చేసిన టీడీపీ.. ఇప్పుడు విద్యుత్ తీగ‌లు అని బుకాయిస్తూ.. చెట్ల న‌రికివేత అంశం నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment