సినీ రంగంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ రంగంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై ఒక రకమైన భరోసా కలిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ, సీఎం చంద్రబాబు సినిమా రంగం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం, తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ నగరాన్ని హబ్‌గా తీసుకుంది అని పేర్కొన్నారు. దీనికి టీడీపీ ప్రభుత్వం కల్పించిన అవకాశాలే కారణమని, గతంలో తీసుకున్న నిర్ణయాలు మరియు సౌకర్యాలు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఈ పరిస్థితిని కల్పించాయని చంద్ర‌బాబు స్పష్టం చేశారు.

అలాగే, కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ విస్తరించడాన్ని కూడా గుర్తించి, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే సమయానికి, అన్ని సినిమాలు ఇక APలోనే జరగడం అనేది ఒక వాస్తవం అవుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతిలో సినిమాలకి మంచి మార్కెట్ ఉంటుందని, తాము ఆ దిశగా పలు చర్యలు చేపడుతామనే మాట ఇచ్చారు.

ఇటీవ‌ల రేవంత్ స‌ర్కార్ బెన్‌ఫిట్ షోలు ఉండ‌వు, టికెట్ల రేట్ పెంపుద‌ల జ‌ర‌గ‌ద‌ని ఖ‌రాఖండిగా చెప్ప‌డంతో సినీ ప‌రిశ్ర‌మ ఏపీకి త‌ర‌లిరావాల‌నే డిమాండ్లు అధిక‌మ‌య్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment