ముగిసిన సీఎల్పీ మీటింగ్‌.. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు?

ముగిసిన సీఎల్పీ మీటింగ్‌.. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు?

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ (CLP) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా, పార్టీ లైన్‌ను దాటి వ్యవహరించే నేతలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా, వారిపై చర్యలు తప్పవు. అంతేకాదు, ఏదైనా అనుమానాలు లేదా అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని సమావేశంలో సీనియర్ నేతలు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
సీఎల్పీ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలకంగా చర్చించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ అంశాలపై ప్రచారం కోసం
రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సభలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఇక పార్టీ నేతలు తీసుకున్న ఈ నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment