‘అపోలో’ లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా

అపోలో లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా

చిత్తూరు (Chittoor)జిల్లాలోని అపోలో యూనివర్సిటీ (Apollo University)లో సంచలన ఘటన చోటుచేసుకుంది. లేడీస్ హాస్టల్ బాత్రూం (Hostel)లో హిడెన్ కెమెరా (Hidden Camera) గుర్తించిన‌ విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టాయిలెట్స్‌లో అనుమానాస్పద శబ్దం వినిపించడంతో ఒక విద్యార్థిని అనుమానం వ్యక్తం చేసి ఈనెల 1న యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కి సమాచారం ఇచ్చింది.

విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ పోతురాజు (Registrar Pothuraju) వెంటనే తాలూకా పోలీస్‌స్టేషన్‌లో రహస్యంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చిత్తూరు తాలూకా పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఈ ఘటన వెనుక తమిళనాడు రాష్ట్రం విరుదునగర్‌ జిల్లాకు చెందిన ప్రైవేట్ సైట్ ఇంజనీర్ కాంతా రూబెన్ ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్‌ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని ప్రశ్నిస్తున్నట్లు చిత్తూరు తాలూకా సిఐ నిత్య బాబు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, యూనివర్సిటీ పరిపాలన భద్రతా చర్యలు కఠినంగా తీసుకోవాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment