టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరోసారి సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులను(Police) ఆశ్రయించారు. ఇటీవల సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు, వ్యాఖ్యలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దయా చౌదరి అనే ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని గుర్తించి, సంబంధిత వివరాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేశారు చిరంజీవి.
తాను ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇలాంటి పోస్టులు ఆగలేదని, దుష్ప్రచారం కొనసాగుతుందని పేర్కొంటూ, తక్షణ చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అబద్ధాల ఆధారంగా ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో కూడా చిరంజీవి, AI సాంకేతికతను ఉపయోగించి తనపై డీప్ ఫేక్ వీడియోలు (Deep Fake Videos), ఫొటోలు (Photos) తయారుచేసి వాటి ద్వారా తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో, మెగాస్టార్ ఈసారి కూడా నేరుగా సైబర్ క్రైమ్ సహాయం కోరారు.





 



