చిరంజీవి కోసం రాశి ఖన్నా, మాళవిక మోహనన్?

చిరంజీవి కోసం రాశి ఖన్నా, మాళవిక మోహనన్?

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi)తో దర్శకుడు బాబీ (KS రవీంద్ర) (Bobby)(K.S Ravindra) చేయబోయే మాస్ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు సినిమాలో ఇద్దరు కథానాయికల కోసం బాబీ అన్వేషణ మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా, మొదటి హీరోయిన్ పాత్ర కోసం ఇటీవల రాశి ఖన్నా (Raashi Khanna)తో చర్చలు జరిపాడు. ఇప్పటికే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)లో నటిస్తున్న రాశి ఖన్నా, మెగా హీరోలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంది. చిరంజీవి సరసన నటించేందుకు ఆమె ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది, త్వరలోనే ఆమె ఈ అవకాశాన్ని దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది.

రెండో కథానాయిక పాత్ర కోసం దర్శకుడు బాబీ మాళవిక మోహనన్ను సంప్రదించాడట. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) షూటింగ్‌లో బిజీగా ఉన్న మాళవిక మోహనన్‌  (Malavika Mohanan)ను, ఆ సినిమా పూర్తయ్యాక చిరంజీవి సినిమాకు డేట్స్ కేటాయించాలని బాబీ కోరాడు. అయితే, ఈ సమయంలో పాన్ ఇండియా ఆఫర్లు వస్తుండటంతో, ఇంత సీనియర్ హీరో పక్కన నటించడంపై ఆమె ఇంకా సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. మాళవిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే, ఆ పాత్రకు నిధి అగర్వాల్ను తీసుకునే అవకాశం ఉంది. చివరకు ఈ ముగ్గురిలో ఎవరు ఫైనల్ అవుతారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment