చంద్ర‌బాబు ‘స్కిల్‌’.. మ‌రో కేసు మూసివేత‌కు రంగం సిద్ధం?

చంద్ర‌బాబు 'స్కిల్‌'.. మ‌రో కేసు మూసివేత‌కు రంగం సిద్ధం?

వైసీపీ ప్రభుత్వ (YSR Congress Party Government) హయాంలో ఆధారాలతో సహా నమోదైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Chief Minister N. Chandrababu Naidu)పై కేసులు(Cases) ఒక్కొక్కటిగా మూసివేయబడుతున్నాయా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆధారాలు ఉన్నప్పటికీ, పిటిషనర్లే (Petitioners) ముందుకు వచ్చి కేసులను ఉపసంహరించుకోవడం (Withdrawal) వెనుక తీవ్ర అధికార దుర్వినియోగం జరుగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే చంద్ర‌బాబుపై న‌మోదైన ఫైబర్‌నెట్‌ (Fibernet), రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్‌ (Assigned Lands Case in Capital), లిక్కర్‌ (Liquor Scam Case), ఇసుక కేసులు (Sand Mining Case) మూసివేశారు. తాజాగా రూ.371 కోట్ల  స్కిల్ స్కామ్ కేసును కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే.

తాజాగా స్కిల్ స్కామ్ కేసులో ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ (Mistake of Facts) కింద సీఐడీ పిటిషన్ (CID Petition) దాఖలు చేయడంతో కేసు మూసివేత ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారని, కేసు క్లోజర్‌కు పూర్తి సహకారం అందిస్తున్నారని ప్రతిపక్ష వర్గాలు ఆరోపిస్తున్నాయి. త‌న‌పై న‌మోదైన కేసుల‌ను ధైర్యంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసులు ఒక్కొక్క‌టిగా క్లోజ్ చేయించుకుంటున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక స్కిల్ కేసు క్లోజర్ రిపోర్టుపై అభ్యంతరాలుంటే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లో కోర్టుకు హాజరై తమ వాదన వినిపించాలని సూచించడం, కేసును వేగంగా ముగించాలనే ఉద్దేశాన్ని బయటపెడుతోందని విమర్శకులు నెటిజ‌న్ల నుంచి వ్య‌క్తం అవుతున్నాయి.

ఈ స్కిల్ స్కామ్ కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసి, నిందితుల ఆస్తులను అటాచ్ చేయ‌డం గ‌మ‌నార్హం. తీవ్ర అవినీతి ఆరోపణలు, కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలు ఉన్నప్పటికీ, కేసును మూసివేయడానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏమాత్రం సంకోచించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

మొత్తంగా చూస్తే, చంద్రబాబు నాయుడు తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా క్లోజ్ చేయించుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే రేపుతున్నాయి. త‌న‌పై న‌మోదైన కేసుల‌ను ధైర్యంగా ఎదుర్కొలేక చంద్ర‌బాబు ఒక్కొక్క‌టి క్లోజ్ చేయించుకోవ‌డం అధికార దుర్వినియోగమే అవుతోంద‌న్న చ‌ర్చ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే చంద్ర‌బాబు ఈ కేసుల విష‌యంలో ఎలా స్పందిస్తారో అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment