---Advertisement---

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్
---Advertisement---

ఆంధ్రప్రదేశ్ సర్కారు విజయవాడ, వైజాగ్ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించేందుకు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫ్లై ఓవర్‌పై మెట్రో రైలు కోసం ట్రాక్‌, కింద వాహనాల కోసం మ‌రో రహదారి ఉంటుంది. వైజాగ్‌లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ, అలాగే విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమనూరు వరకూ ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు తాజా సమీక్షలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిజైన్లను ఆమోదించారు. ఈ ప్రాజెక్ట్ అమ‌లు జ‌రిగితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాక, మెట్రో ప్రయాణాలకు కొత్త దారులు తెరుచుకుంటాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment