ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ప్రారంభమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో టీమిండియా వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. దుబాయ్ వేదికగా గ్రాండ్ ఫైనల్ ఇవాళ మధ్యాహ్న ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు(India vs New Zealand) తలపడనుంది. 12 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి అందుకోవాలనే పట్టుదలతో టీమిండియా బరిలో దిగుతోంది.
2002, 2013లలో ఈ టైటిల్‌ను సాధించిన ఘనత భారత్ పేరిట ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ కూడా ఈసారి టైటిల్ గెలవాలనే సంకల్పంతో బలంగా ఎదుర్కొననుంది. రెండు జట్లు కూడా సమర్థవంతమైన ఆటగాళ్లతో కూడినవే కావడంతో, ఈ ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగనుంది. భారత్ తన విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తుందా? లేక న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా? మరికొన్ని గంటల్లో తేలనుంది.