2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.53,47,315 కోట్లతో ఈ బడ్జెట్ రూపొందినట్లు ప్రకటించారు. ఇది దేశ ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్లలో ఒకటిగా నిలిచింది. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనతను కూడా నిర్మలా సీతారామన్ సొంతం చేసుకున్నారు. ఈ బడ్జెట్‌లో మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.35,33,150 కోట్లుగా, మూలధన వసూళ్లను రూ.18,14,165 కోట్లుగా అంచనా వేశారు.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
బడ్జెట్ ప్రసంగం అనంతరం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి.సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 350 పాయింట్లకుపైగా క్షీణించింది. బడ్జెట్ ప్రతిపాదనలపై ఇన్వెస్టర్ల మిశ్రమ స్పందన ఇందుకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కొత్త ట్యాక్స్ రెజైమ్‌లో ఆదాయ పన్ను స్లాబ్‌లు
కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్‌లను మరింత సరళంగా రూపొందించారు.
₹0 – ₹4 లక్షలు → నిల్
₹4 – ₹8 లక్షలు → 5%
₹8 – ₹12 లక్షలు → 10%
₹12 – ₹16 లక్షలు → 15%
₹16 – ₹20 లక్షలు → 20%
₹20 – ₹24 లక్షలు → 25%
₹24 లక్షల పైబడి → 30%
విదేశాల్లోని భారతీయులకు శుభవార్త
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఈ బడ్జెట్‌లో పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పరిమితి పెంపు, మెడికల్ టూరిజానికి ప్రోత్సాహకాలు, క్లౌడ్ డేటా సెంటర్లకు ప్రత్యేక చేయూత, త్వరలో సరళమైన ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ విధానం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
- ట్యాక్స్ నిబంధనల్లో కీలక సడలింపులు
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమలు
- టీసీఎస్ 5% నుంచి 2%కు తగ్గింపు
- ఆదాయపన్ను చెల్లింపు గడువు మార్చి 31 వరకు పొడిగింపు
- చిన్నతరహా పన్ను చెల్లింపుదారులకు 6 నెలల ఊరట
- మోటార్ యాక్సిడెంట్ పరిహారాలపై పన్ను సడలింపు
- విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీమ్
- జూలై 31 వరకు ITR-1, ITR-2 ఫైలింగ్ అవకాశం
- మెడికల్ టూరిజానికి భారీ ప్రోత్సాహం
- ప్రైవేట్ రంగంతో కలిసి ఐదు రీజినల్ మెడికల్ హబ్‌లు
- మెడికల్ హబ్‌ల ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు
- దేశవ్యాప్తంగా మూడు ఆల్ ఇండియా ఆయుర్వేద కాలేజీలు
- సామాజిక అభివృద్ధికి పెద్దపీట
- ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్
- భారత్ విస్తార్ AI టూల్ ప్రారంభం
- దివ్యాంగ్ జన యోజనకు విస్తరణ
- కార్గో, జలమార్గాల అభివృద్ధి
- వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జలమార్గాలు
- ఒడిశాలో నేషనల్ వాటర్‌వే కారిడార్
- కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ ప్రారంభం
- ఆత్మనిర్భర్ భారత్‌కు భారీ కేటాయింపులు
- విలువైన ఖనిజాల తవ్వకాల కోసం కొత్త స్కీమ్
- కేరళ, తమిళనాడు, ఒడిశా, ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్
- బయోఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
- మూడు డెడికేటెడ్ కెమికల్ పార్కులు
- సెమీకండక్టర్ మిషన్‌కు రూ.40 వేల కోట్లు
- సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభం
- SME రంగానికి రూ.10 వేల కోట్లు
- మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు
- కంటైనర్ మాన్యుఫాక్చరింగ్‌కు రూ.10 వేల కోట్లు
- హైస్పీడ్ రైల్ కారిడార్లు
- ముంబై – పూణే
- పూణే– హైదరాబాద్
- హైదరాబాద్ – చెన్నై
- ఢిల్లీ – వారణాసి
- వారణాసి – సిలిగురి
- హైదరాబాద్ – బెంగళూరు
- చెన్నై – బెంగళూరు
“ఇది యూనిక్ బడ్జెట్”: నిర్మలా సీతారామన్
బడ్జెట్ ప్రసంగం చివరలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ విధానాల వల్లే 7% వృద్ధి సాధ్యమైందని, ఉపాధి కల్పనకు పెద్దపీట వేశామని తెలిపారు. టెక్స్‌టైల్, కార్గో, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామని, కంటైనర్ తయారీ రంగానికి ప్రత్యేక స్కీమ్ తీసుకొచ్చామని తెలిపారు. 2026–27 కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని, దీర్ఘకాలిక వృద్ధికి పునాది వేస్తుందని కేంద్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.








