---Advertisement---

‘ఫిర్యాదు చేసినందుకు నాపైనే కేసా?’ – అంబటి రాంబాబు షాక్

ఫిర్యాదు చేసినందుకు నా మీదే కేసా? - అంబటి రాంబాబు షాక్
---Advertisement---

పోలీసుల తీరుపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు అవాక్క‌య్యారు. త‌న ఫిర్యాదుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనపైనే కేసు పెట్టారని, ఇది ఎంత వ‌ర‌కు ధ‌ర్మం అని అంబటి రాంబాబు ప్ర‌శ్నించారు. “నేను పోలీసులను తప్పుబట్టడం లేదు, కానీ ఇది మొత్తం న‌డిపిస్తుంది లోకేషే” అని ట్వీట్ చేశారు.

నిన్న గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్న దుష్ప్ర‌చారం, అభ్య‌క‌ర్త పోస్టుల‌పై ఫిర్యాదు చేసేందుకు అంబ‌టి రాంబాబు వెళ్లారు. పోలీసులు స్పందించకపోవడంతో స్టేష‌న్ ఎదుట మెట్ల‌పై కూర్చొని నిరసన తెలిపారు.

కాగా, అంబ‌టి రాంబాబు నిర‌స‌న తెల‌ప‌డం వ‌ల్ల “పోలీసు విధులకు ఆటంకం కలిగించడం” అనే అభియోగంతో ఆయనపై కేసు నమోదు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment