కెనరా బ్యాంకులో భారీ చోరీ.. 59 కిలోల బంగారం మాయం

కెనరా బ్యాంకులో బంగారం భారీ చోరీ

భ‌ద్రంగా ఉంటుంద‌ని క‌స్ట‌మ‌ర్లు (Customers) బ్యాంక్‌ (Bank)లో పెట్టిన బంగారం చోరీకి గురైంది. ఈ భారీ దొంగ‌త‌నం కర్ణాటకలోని మంగోలీ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకు (Canara Bank) శాఖలో జరిగింది. డిపాజిటర్లు (Depositors) తమ ఖాతాల్లో ఉంచిన 59 కిలోల బంగారాన్ని (Gold) దొంగలు (Thieves) దోచుకుపోయారు. ఈ ఘటన వారం రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.

విజయపుర ఎస్పీ (Vijayapura SP) లక్ష్మణ్‌ బి.నింబర్గి (Lakshman B. Nimbargi) సోమవారం మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. గత నెల 23న సాయంత్రం బ్యాంకు సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లారు. 24, 25 తేదీల్లో వారాంత సెలవులు ఉండటంతో బ్యాంకు మూసి ఉండింది. 26వ తేదీన సిబ్బంది బ్యాంకుకు వచ్చి తాళాలు పగిలిపోయిన విషయం గమనించారు. తరువాత పరిశీలనలో 59 కిలోల బంగారం గాయమైందని తెలిసింది. ఇప్పటికే పోలీసులు విచారణ మొదలు పెట్టారు మరియు దొంగలను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. బంగారం భారీ ఎత్తున చోరీకి గురికావ‌డంతో క‌స్ట‌మ‌ర్లంతా ఒక్క‌సారిగా బ్యాంక్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. త‌మ బంగారం ప‌రిస్థితి ఏంట‌ని బ్యాంక్ సిబ్బందిని నిల‌దీస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment