కెనడాలో పోస్టల్ ఉద్యోగుల సమ్మెను ముగించేందుకు కెనడా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. లేబర్ మినిస్టర్ స్టీవెన్ మెకినన్ శుక్రవారం క్యానడా పోస్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ నిర్ణయం సమ్మె కొనసాగితే వారినంతా విధుల నుంచి బహిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు.
55,000 ఉద్యోగుల పోరాటం
గత నవంబర్ 15వ తేదీన 55,000 పోస్టల్ ఉద్యోగులు వేతనాలు మరియు పని భారం తగ్గించాలని పోరాటం మొదలు పెట్టారు. ఈ సమ్మె మూలంగా దేశవ్యాప్తంగా డెలివరీలు నిలిచిపోయాయి. ఈ సమ్మె మరింత సమస్యలకు దారి తీసింది.
సమాజంపై ప్రభావం..
ఈ సమ్మె వాణిజ్య వ్యవస్థపై, ముఖ్యంగా షాపింగ్ సీజన్ లో తీవ్రమైన ప్రభావం చూపించింది. కొంతమంది వ్యాపారులు ఆర్థిక నష్టాలకు లోనవుతున్నారు. అంతేకాక, కెనడా పోస్టల్ సర్వీసులు నిలిచిపోయిన కారణంగా, ముఖ్యమైన పాస్‌పోర్టులు మరియు ఇతర డాక్యుమెంట్లు 85,000 వరకు నిలిపివేయబడ్డాయి.
వేతనాల పెంపు కోసం
కెనడా పోస్టల్ వర్కర్స్ యూనియన్ (CUPW) తమ వేతనాలలో 19% పెంపు కోరుతూ పోరాటం చేస్తుంది. ఇది కెనడా పోస్టల్ ప్రతిపాదించిన 11.5% పెంపుకంటే ఎక్కువ. అలాగే, ఉద్యోగాల భద్రత, అనారోగ్యపు సెలవులు, ఉద్యోగ పరిస్థితులపై కూడా చర్చలు జరుపుతున్నారు.
సమ్మె ముగింపునకు దారితీసే నిర్ణయాలు
లేబర్ మినిస్టర్ మెకినన్ మాట్లాడుతూ “ఈ సమ్మె వల్ల కెనడియన్లు చాలా ఇబ్బంది పడుతున్నారు” అని చెప్పారు. ఆయన ప్రకటన ప్రకారం, 22 మే వరకు ఉద్యోగులు తమ ప్రస్తుత ఒప్పందం ఆధారంగా పనిచేయాలని ఆదేశించారు, అప్పుడు కొత్త ఒప్పందం తీసుకురావాలని ఆశిస్తున్నారు.







