CBI కార్యాలయంలోనే చోరీ.. అధికారులు షాక్‌

CBI కార్యాలయంలోనే చోరీ.. అధికారులు షాక్‌

అవినీతి ప‌రుల‌ను గుర్తించి అరెస్టు చేసే సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (CBI) ఆఫీస్‌లో చోరీ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త్రిపుర రాష్ట్రంలోని ష్యామలీ బజార్ కాంప్లెక్స్‌లోని సీబీఐ కార్యాలయంలో దొంగతనం జరిగింది. కార్యాలయం మూసి ఉండటాన్ని అదునుగా చేసుకున్న దొంగలు, కుర్చీలు, డోర్లు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్ సామగ్రి వంటి వస్తువులను దోచుకుపోయారు. కేవలం గోడలు మాత్రమే మిగిల్చి, మిగతా అన్నింటినీ అపహరించారు.

అదుపులో అనుమానితులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అగర్తల సమీపంలో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, మిగతా వస్తువుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చోరీ వెనుక వేరే కుట్ర ఉందా? అనే కోణంలో కూడా పోలీసుల విచార‌ణ కొన‌సాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment