---Advertisement---

‘పేర్ని నానిని ఉరి తీయాలి’.. టీడీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

'పేర్ని నానిని ఉరి తీయాలి'.. టీడీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
---Advertisement---

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడి పుట్టిస్తోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మ‌ధ్య ఫార్ములా ఈ-రేస్ విష‌యంలో మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం రేష‌న్ బియ్యం, క‌రెంట్ చార్జీల పెంపు, అక్ర‌మ కేసుల అంశం హాట్ హాట్‌గా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ-వైసీపీ నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న మ‌రో అడుగు ముందుకేసి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వ‌హించిన టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న వైసీపీ నేత పేర్ని నానిని ఉరి తీయాల‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్నారంటూ నానిపై తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. ప్ర‌తీ చిన్న విష‌యానికి నాని మీడియా ముందుకు వ‌చ్చి కూట‌మి నేత‌ల‌పై విరుచుకుప‌డ‌తార‌ని వ్యాఖ్యానించారు. 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాయం చేశార‌ని ఆరోపించారు. కాగా, బుద్ధా వెంక‌న్న కామెంట్స్‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్‌లో రేష‌న్ బియ్యం మాయం అయ్యాయ‌ని గ‌త కొద్దిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే పేర్ని నాని భార్య జ‌య‌సుధ‌పై కేసు సైతం న‌మోదు చేశారు. తాజాగా ఈ కేసుతో సంబంధం లేక‌పోయినా పేర్ని నాని, ఆయ‌న కుమారుడు కిట్టుకి రాబ‌ర్ట్‌స‌న్‌పేట పోలీసులు నోటీసులు జారీ చేశారని వైసీపీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment