ఉప రాష్ట్రపతి (Deputy Vice President) ఎన్నికల (Elections) విషయంలో బీఆర్‌ఎస్(BRS) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పార్టీ తటస్థంగా ఉండాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR) నిర్ణయించినట్టు తెలుస్తోంది.
రిపోర్టుల ప్రకారం, బీఆర్‌ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం — ఎన్డీయే(NDA) మరియు ఇండియా(INDIA) కూటములు (Alliances) రెండూ తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) అన్యాయం చేశాయని వారి భావన. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించింది.ఇక నోటా (నన్ ఆఫ్ ది అబౌవ్) ఆప్షన్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఉండకపోవడంతో, పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్‌ఎస్‌కు నలుగురు సభ్యులు ఉన్నారు. వారు: వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, బీ.బీ. దామోదర్ రావు, పార్థ సారథి రెడ్డి.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్