కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు(Project)లో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అవినీతి (Corruption)కి పాల్పడ్డారని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. కవిత వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ, పార్టీ హరీష్ రావుకు పూర్తి మద్దతు ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే, తెలంగాణ (Telangana) అసెంబ్లీ (Assembly)లో కాళేశ్వరంపై జరిగిన చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడిన ఒక వీడియోను బీఆర్ఎస్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో హరీష్ రావు “సింహం సింగిల్‌గా వస్తుంది” అని పేర్కొన్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, “ఇది ఆరడుగుల బుల్లెట్టు… సింహం సింగిల్‌గా వస్తుంది” అంటూ బీఆర్ఎస్ ఒక కామెంట్‌ను జతచేసింది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్ష్యంగా ఆధారాలతో తిప్పికొట్టిన హరీష్ రావుకు మద్దతుగా ఈ పోస్ట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఈ పోస్ట్ ద్వారా, కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమవుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ నాయకత్వం, హరీష్ రావుకు అండగా నిలుస్తున్నట్లు ఈ చర్యతో వెల్లడైంది.