త‌మ్ముడు త్వ‌ర‌గా కోలుకోవాలి.. జ‌గ‌న్ ట్వీట్‌

త‌మ్ముడు త్వ‌ర‌గా కోలుకోవాలి.. జ‌గ‌న్ ట్వీట్‌

బీఆర్‌ఎస్‌ (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) జిమ్‌ (Gym) లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. స్లిప్ డిస్క్ సమస్య (Slip Disk Problem) తలెత్తగా, డాక్ట‌ర్లు (Doctors) కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ (Bed Rest) అవ‌స‌ర‌మ‌ని సూచ‌న చేశారు. కాగా, గాయ‌ప‌డిన కేటీఆర్ త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత, ఏపీ (Andhra Pradesh) మాజీ సీఎం (Former CM) వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆకాంక్షించారు.

ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా త‌న సందేశాన్ని పంపించారు. “బ్రదర్‌ కేటీఆర్‌ (Brother KTR).. మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ట్వీట్ (Tweet) చేశారు. వైసీపీ శ్రేణులు సైతం కేటీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ను కేటీఆర్ అన్నా అని సంబోధిస్తుంటారు. కాగా, త‌మ్ముడు గాయం నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అన్న ఆకాంక్షిస్తున్నాడ‌ని కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. కేటీఆర్‌ గాయం వార్త తెలిసిన తర్వాత అనేక మంది ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరితగతిన కోలుకోవాలని స్పందిస్తున్నారు.

కేటీఆర్‌ గాయంపై ఇప్పటికే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న‌ కేటీఆర్‌ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా గాయం ఘ‌ట‌న‌ను వెల్ల‌డించారు. త్వ‌ర‌గా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment