పహల్గాం దాడి: భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్

పహల్గాం దాడి: భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్

ఆసియా కప్ 2025లో భారత్ మరియు పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, పహల్గాం, ఆపరేషన్ సిందూర్‌ ఘటనల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

సుప్రీంకోర్టులో సైతం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ ఒక పిల్ దాఖలైంది. అయితే, సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరిస్తూ, “అది కేవలం ఒక ఆట మాత్రమే, దానిని ఆటగా ఉండనివ్వండి” అని వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు సతీష్ షా తన అభిమానులను మ్యాచ్‌ను బహిష్కరించాలని కోరారు. “ప్రతి దేశభక్తుడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. మ్యాచ్ సమయంలో మీ టీవీని ఆఫ్ చేయండి. భారత జట్టు పట్ల ఉన్న గౌరవం పోయింది” అని ఆయన పోస్ట్ చేశారు. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ, “మ్యాచ్ నిర్ణయించింది జట్టు కాదు, బీసీసీఐ” అని పేర్కొన్నారు. భారత ఆర్మీ పట్ల గౌరవం ఉంటే పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని లేదా టోర్నీని బాయ్‌కాట్ చేయాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment