ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు (Botsa Satyanarayana) శాసనమండలిలో స్వల్ప అస్వస్థత (Illness) ఏర్పడింది. కాగ్ నివేదికపై (CAG Report) మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా రక్తపోటు (Blood Pressure) పెరిగి తూలిపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే ఉన్న మరో సభ్యుడు వెంటనే పట్టుకోవడంతో ఆయన కిందపడకుండా ప్రమాదం తప్పింది.
వెంటనే మండలిలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించగా రక్తపోటు 190/120గా ఉన్నట్లు గుర్తించారు. రక్తపోటు హెచ్చుతగ్గుల కారణంగా ఈ అస్వస్థత వచ్చిందని వైద్యులు తెలిపారు.
అయితే తన ఆరోగ్యం గురించి బొత్స స్పందిస్తూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. ఆయన త్వరగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.








