బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరిన బొత్స

వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) రావడంతో కుటుంబ సభ్యులు అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు.

హైదరాబాద్‌లో అత్యవసర చికిత్స
బొత్స సత్యనారాయణను హైదరాబాద్‌ (Hyderabad)లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి (City Neuro Center Hospital) లో చేర్పించి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణుల వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

బొత్స ఆరోగ్యంగా ఉన్నారు – కుమార్తె అనూష‌
బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయ‌న కుమార్తె అనూష తెలిపారు. బీపీ ఎక్కువగా ఉండటంతో టెస్టులు చేస్తున్నారని, మండలి అయ్యాక రేపు వెళ్లాలనికున్నాం కానీ, నీరసంగా ఉండటంతో ఒకరోజు ముందే హైదరాబాద్ వచ్చామ‌ని ఆమె వివ‌రించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment