కూటమి ప్రభుత్వం (Coalition Government) విద్యార్థుల జీవితాలతో (Students Lives) చెలగాటం ఆడుకుంటోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) అన్నారు. ముఖ్యమంత్రి కొడుకు నిర్వర్తిస్తున్న శాఖలో తప్పులు జరిగితే చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పదవ తరగతి పరీక్షల మూల్యాంకనంలో జరిగిన తప్పులపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక, టీడీపీ నిర్వహించిన మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
టెన్త్ మూల్యాంకనంలో తప్పులు
పదవ తరగతి (10th Class) పరీక్షల (Examinations) మూల్యాంకనంలో (Evaluation) జరిగిన తప్పులపై (Mistakes) మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పుల వల్ల విద్యార్థులు మానసిక క్షోభకు గురయ్యారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుందని ఆయన అన్నారు.
వింతగా వక్రీకరణ: “ఎప్పుడూ 20 నుండి 90 మార్కులకు పెరగలేదు. మార్పులు చాలా తక్కువ మార్కులతో ఉండాలి, కానీ ఈసారి చాలా నిర్లక్ష్యంగా మూల్యాంకనం చేశారు” అని బొత్స ఆరోపించారు. తప్పు చేయడమే కాకుండా.. అంతకు ముందు ఇంకా ఎక్కువ మార్పులు జరిగాయని వింతగా వక్రీకరణ చేయడం దారుణమన్నారు.
సిబ్బందిపై ఒత్తిడి: ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) (SOP – Standard Operating Procedure)కు విరుద్ధంగా తక్కువ రోజుల్లో మూల్యాంకణం చేయడం, సిబ్బందిపై ఒత్తిడి పెంచడం వల్ల ఈ తప్పులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. “రోజుకి ఒక ఉపాధ్యాయుడు ఎన్ని పేపర్లు (How Many Papers) కరెక్ట్(Correct)చేయాలో ఒక లెక్క ఉంటుంది. ఎలా మూల్యాంకనం చేయాలో అవగాహన ఉండాలి” అని ఆయన అన్నారు.
చర్చకు నేను సిద్ధం: ఈ తప్పులపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. “అధికారులు సమావేశం పెడితే నేను కూడా వస్తాను. మూల్యాంకనంలో తప్పులు ఎలా జరిగాయో చెప్తాను. బహిరంగంగా చర్చించడానికి నేను సిద్ధం” అని ఆయన సవాల్ విసిరారు.
విద్యార్థుల భవిష్యత్తు: “విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడటం సమంజసం కాదు. ఫెయిల్ అయ్యామని జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఏ ఏడాదైనా 5,000కి మించి మార్పులు జరిగాయా అని ఆయన అడిగారు, ఈ స్థాయిలో తప్పులు గతంలో ఎన్నడూ లేవని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు.
టీడీపీ మహానాడుపై విమర్శలు
బొత్స సత్యనారాయణ టీడీపీ నిర్వహించిన మహానాడు(Mahanadu)పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. “మహానాడు మూడు రోజులూ ఆత్మస్తుతి పరనిందతో నిండిపోయింది. ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా చెప్పలేదు,” అని ఆయన అన్నారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పుకోలేకపోయిందని, సూపర్ సిక్స్ (Super Six) హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. “తల్లికి వందనం” పథకం గత సంవత్సరం నుంచి ఎందుకు అమలు కాలేదని ఆయన ప్రశ్నించారు.
మీడియా వక్రీకరణ ఆరోపణలు
ఈనాడు పత్రిక వక్రీకరణ వార్తలు రాసిందని బొత్స ఆరోపించారు. “గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి తప్పులు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలు తలెత్తాయి” అని ఆయన అన్నారు. ప్రజలకు సరైన సమాచారం అందించడంలో మీడియా విఫలమైందని ఆయన విమర్శించారు.