రోజాపై జ‌న‌సేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు (VIDEO)

రోజాపై జ‌న‌సేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

మాజీ (Former) ముఖ్య‌మంత్రి (Chief Minister) వైఎస్ జ‌గ‌న్‌ (Y.S. Jagan), మాజీ మంత్రి ఆర్కే రోజా (R.K.Roja)పై జ‌న‌సేన‌ ఎమ్మెల్యే (Jana Sena MLA) బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetti Srinivas) వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial Comments) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. మ‌హిళా నేత‌ (Woman Leader)పై బొలిశెట్టి అనుచిత వ్యాఖ్య‌లు జ‌న‌సేన పార్టీకి కొత్త తొల‌నొప్పిని తెచ్చిపెట్టాయంటున్నారు ఆ పార్టీ నేత‌లు.

విజయవాడ (Vijayawada)లో జరిగిన ఒక కార్యక్రమంలో బొలిశెట్టి మాట్లాడుతూ “ప్రభుత్వ మంచిని చెప్పకపోతే రప్పా రప్పా గాళ్లు రోడ్డెక్కుతున్నారు. రోజా ఎమ్మెల్యే నా కొడుకులు అని అంటోంది. అది ఆడదో, మగదో ఎవరికీ తెలియదు. జగన్ కూడా రోజా కొడుకేనా?” అని చేసిన‌ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. ఆయన మాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, కనీస మర్యాద లేకుండా రోజాను ‘అది, ఇది’ అని సంబోధించడం పట్ల వైసీపీ శ్రేణులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బొలిశెట్టి శ్రీనివాస్ ఇంకా మాట్లాడుతూ.. “రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. పట్టుబడ్డోళ్లందరూ దొంగలు అయితే, జగన్ గజ దొంగ” అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. “అధికారంలో ఉన్నవారు ఆడవారిపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే, అది చెలమణి అవుతుందని అనుకుంటే, కాలమే సమాధానం చెబుతుంది” అని పలువురు నెటిజన్లు హెచ్చ‌రిస్తున్నారు. రోజాపై ఇటీవల నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యల తర్వాత, బొలిశెట్టి వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని రేకెత్తించాయి.

మ‌హిళా గౌర‌వం గురించి వేదిక‌ల‌పై ఉప‌న్యాసాలు ఇచ్చే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ ఎమ్మెల్యేలకు మ‌హిళ‌ల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించాలో నేర్పించ‌లేదా..? అని ప్ర‌శ్నిస్తున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment