భారత్ vs పాకిస్థాన్ (INDvsPAK) మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోర పరాజయం పాలైంది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో ఆతిధ్య జట్టుగా బరిలో దిగిన పాక్, భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం పాక్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. పాక్ ఓడిన ప్రతిసారి అభిమానులు టీవీలపై తమ కోపం చూపడం తెలిసిందే.
దీనిపై ఇనిస్టెంట్ డెలివరీ యాప్ బ్లింకిట్ (Blinkit) క్రియేటివ్ సెటైర్ వేసింది. “సారీ పాక్.. మీకు 10 నిమిషాల్లో టీవీని డెలివరీ చేయలేం” అంటూ బ్లింకిట్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఢిల్లీ పోలీస్ సెటైర్లు..
ఢిల్లీ పోలీస్ (Delhi Police) డిపార్ట్మెంట్ కూడా ఈ ఫన్నీ ట్రెండ్‌లో జాయిన్ అయ్యింది. “పక్క దేశం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి.. అదృష్టవశాత్తూ అవి కేవలం టీవీలు బద్దలవుతున్న శబ్దాలే అని అనుకుంటున్నాం” అంటూ ఢిల్లీ పోలీసుల ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
మీమ్స్ పండగ..
పాక్‌లో టీవీల రక్షణ కోసం ఇనుప కంచెలు వేసిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. భారత్ గెలుపు, పాక్ ఓటమి నేపథ్యంలో నెటిజన్లు మీమ్స్ ఫెస్టివల్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.
Sorry, not sorry 🤭 pic.twitter.com/79QlLTTHrU
— Blinkit (@letsblinkit) February 23, 2025