పాక్‌లో జాఫ‌ర్ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్.. 100కి పైగా సైనికులు బందీ

పాక్‌లో జాఫ‌ర్ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్.. 100కి పైగా సైనికులు బందీ

కిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉద్రిక్తత ప‌రిస్థితులు సృష్టించింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా BLA బోలాన్ జిల్లాలో సంచలన దాడికి తెగబడ్డారు. ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలును హైజాక్ చేయడం దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ఈ రైలు, బోలాన్‌లోని టన్నెల్-8 దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రైలులో 700 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, 100కి పైగా పాకిస్తానీ సైనికులను బీఎల్ఏ బందీగా తీసుకుంది. ఈ విషయాన్ని BLA ప్రతినిధి జీయంద్ బలోచ్ ప్రకటించారు. పాక్ బలగాలు ఏదైనా ఆపరేషన్ చేపడితే ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలుగుతుందని బీఎల్ఏ హెచ్చరించింది. ఈ హైజాక్ ఆపరేషన్‌ను బీఎల్ఏ ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ నిర్వహించింది.

కాల్పుల మోత, ఎయిర్ స్ట్రైక్స్
రైలును కాపాడేందుకు పాక్ సైన్యం ముమ్మరంగా ఆపరేషన్ కొనసాగిస్తోంది. బీఎల్ఏ మరియు పాక్ ఆర్మీ మధ్య కాల్పులు తీవ్రంగా జరుగుతున్నాయి. డ్రోన్, ఎయిర్ అటాక్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికే BLA ప్రకటించిన ప్రకారం 6 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. పరిస్థితి మరింత విషమిస్తే బందీల ప్రాణాలకు ప్రమాదమని BLA మరోసారి హెచ్చరించింది. ముఖ్యంగా పంజాబీ ప్రయాణికులు, పాక్ సైన్యానికి చెందినవారినే ఎక్కువగా బందీగా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, బలూచ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల ప్రయాణికులను విడిచిపెట్టినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment