బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) కూటమి ప్రభుత్వం (Coalition Government)లో బీజేపీ పాత్రను (BJP Role) ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి భాగస్వామ్యంలో బీజేపీకి తగిన ప్రాధాన్యత (Importance) ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర రాజకీయ డైనమిక్స్ (Dynamics)ను పునర్విచారణ చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“కొందరు బీజేపీ బలాన్ని కేవలం 5 శాతంగా అంచనా వేస్తున్నారు. ఇది దారుణం. బీజేపీ బలం 5 శాతం కాదు, అంతకు మరెన్నో రెట్లు ఎక్కువ. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్సీ(BJP MLC) పీవీఎన్ మాధవ్ (PVN Madhav) స్పష్టం చేయాలి” అని అన్నారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 5 శాతం సీట్లు కేటాయిస్తామనడం ఆమోదయోగ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. కూటమి భాగస్వామ్యంలో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు కూటమి భాగస్వాములైన టీడీపీ(TDP), జనసేన (Jana Sena)లతో బీజేపీ మధ్య ఉన్న సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తాయి. గతంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) 2018లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ధర్మాన్ని చంద్రబాబు ఉల్లంఘించారని తీవ్ర వ్యాఖ్యలు ఆరోపించారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు బీజేపీ-టీడీపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రస్తుతం కూడా ఆయన వ్యాఖ్యలు కూటమిలో బీజేపీ పాత్ర, గుర్తింపుపై తీవ్రచర్చను దారి తీశాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించాక, ఈ సీట్లు సర్దుబాటు పంచాయితీ ఇంకా తీవ్రతరం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








