ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల బీజేపీపై కీలక ఆరోపణలు చేశారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ జాగ్రత్తగా ప్రయత్నిస్తోందని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటులో చోటుచేసుకున్న ఘర్షణలు, రాహుల్ గాంధీపై నిందలు మోపడం వంటి చర్యలు ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు.
అమిత్ షా చేసిన వ్యాఖ్యల వీడియో డిలీట్ చేయమంటూ కేంద్రం ‘X’ (ట్విట్టర్) కు నోటీసులు పంపించడం చూస్తుంటే, వారే తప్పు చేశారని స్పష్టమవుతోందని షర్మిల తెలిపారు. దీనివల్ల ప్రజల దృష్టి గందరగోళం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.