బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య!

బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య!

మక్తల్‌లో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప ఆరవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి తొమ్మిదిన సోమవారంతో ప్రచారం ముగిసింది.

అయితే ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్.. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్‌పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. రేపు బుధవారం ఎలక్షన్‌ ఉండడంతో కొందరు వ్యక్తులు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్‌ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment