ఏఐ ఇండియా స‌మ్మిట్‌.. ‘బిల్‌గేట్స్‌కు నో ఎంట్రీ’

ఏఐ ఇండియా స‌మ్మిట్‌.. 'బిల్‌గేట్స్‌కు నో ఎంట్రీ'

ఎప్‌స్టిన్ ఫైల్స్ వివాదాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు అనుమ‌తించ‌లేదు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ” కీ స్పీకర్స్” జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగించిన‌ట్లుగా తెలుస్తోంది. ఎప్‌స్టిన్ ఫైల్స్ వివాదం కార‌ణంగా బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్ కు నో ఎంట్రీ ప్ర‌క‌టించిన‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్లడించాయి.

ఎప్‌స్టిన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పై ఆరోపణ నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్ర‌భుత్వం పునఃసమీక్ష జరిపింది. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు సహకరించిన ఎప్‌స్టిన్ జైలు జీవితం అనుభ‌విస్తూ మ‌ర‌ణించారు. ఆ త‌రువాత ల‌భించిన ఆధారాలు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్ గేట్స్ పై ఆరోపణలు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇండియాలో జ‌రుగుతున్న ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్‌కు బిల్‌గేట్స్‌కు నో ఎంట్రీ ప్ర‌క‌టించారు. జెఫ్రీ ఎప్‌స్టిన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సీక్రెట్ డాక్యుమెంట్స్‌లో ప్రపంచ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సహా పలువురు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు కూడా ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం. చిన్నారులపై లైంగిక దుర్వినియోగం కేసులో దోషిగా తేలిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టిన్ 2019 ఆగస్టులో న్యూయార్క్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా పత్రాల్లో గేట్స్ పేరు జనవరి నెలకు సంబంధించిన భాగంలో కనిపించినట్లు నివేదికలు వెల్లడించాయి. అందులో ఒక నోట్‌లో ఎప్‌స్టిన్‌, గేట్స్ వివాహేతర సంబంధాల్లో పాల్గొన్నట్లు ఆరోపిస్తూ, “రష్యన్ బాలికలతో సంబంధాల వల్ల వచ్చిన సమస్యలను ఎదుర్కొనేందుకు ఔషధాలు అందించడంలో సహాయం చేశాను” అంటూ పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ఆరోపణల నేపథ్యంలో గత వారం బిల్ గేట్స్ క్షమాపణ తెలిపారు. ఫిబ్రవరి 4న ప్రసారమైన 9 న్యూస్ ఆస్ట్రేలియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఆయనతో గడిపిన ప్రతి నిమిషాన్ని నేను పశ్చాత్తాపపడుతున్నాను. క్షమాపణ కోరుతున్నాను” అని గేట్స్ వ్యాఖ్యానించారు.

పత్రాల్లో హర్దీప్ సింగ్ పూరి పేరు కూడా ప్రస్తావనకు రావడంతో, ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ తాను ఎప్‌స్టిన్‌ను “కొన్ని సందర్భాల్లో మాత్రమే, అది కూడా ప్రతినిధి బృందంలో భాగంగా” కలిసినట్లు చెప్పారు.

ఎప్‌స్టిన్ ఫైల్స్ వివాదాల ప్రభావం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌పై పడిన నేపథ్యంలో, బిల్ గేట్స్‌కు నో ఎంట్రీ ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వం బిల్‌గేట్స్ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కూట‌మి ప్ర‌భుత్వం బిల్‌గేట్స్‌కు రాచ‌మ‌ర్యాదులు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment