ఎప్స్టీన్ నీడలో గేట్స్ పర్యటన.. కేంద్రానికి MEA షాకింగ్ సూచన

ఎప్స్టీన్ వివాదం..బిల్ గేట్స్‌తో భేటీకి విదేశాంగ శాఖ విముఖత?

మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల భారత పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. వివాదాస్పద అమెరికన్ ఫైనాన్షియర్ (American Financier) జెఫ్రీ ఎప్స్టీన్‌తో (Jeffrey Epstein) గేట్స్‌కు ఉన్న పాత సంబంధాలపై అంతర్జాతీయంగా మళ్లీ చర్చ మొదలవ్వడంతో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అప్రమత్తమైంది.

మంత్రిత్వ స్థాయి భేటీ వద్దు..MEA సూచన
ఫిబ్రవరిలో బిల్ గేట్స్ భారత్ (India) పర్యటనకు వచ్చిన సమయంలో, ఆయనతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి భేటీ కావడాన్ని విదేశాంగ శాఖ నిరాకరించినట్లు తెలుస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంలో గేట్స్ పేరు వినిపిస్తుండటం వల్ల, రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. “ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని, మంత్రితో కలిసి బిల్ గేట్స్ వేదికను పంచుకోవడం లేదా అధికారిక భేటీ నిర్వహించడం సరైంది కాదు” అని MEA స్పష్టం చేసింది.

ఫిక్కీ (FICCI) కార్యక్రమం వాయిదా
ఫిక్కీ శతాబ్ది వేడుకల (FICCI Centenary Celebrations) సన్నాహకంలో భాగంగా ఫిబ్రవరి 19న జరగాల్సిన కార్యక్రమానికి గేట్స్ హాజరుకావాల్సి ఉంది. అయితే, విదేశాంగ శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమం వాయిదా పడింది. అదేవిధంగా, ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ (Global AI Summit)లో గేట్స్ ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని కూడా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించారు.

జెఫ్రీ ఎప్స్టీన్ వివాదం?
జెఫ్రీ ఎప్స్టీన్ ఒకప్పుడు అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. మైనర్లపై లైంగిక వేధింపుల నెట్‌వర్క్ నడిపిన కేసులో ఆయన నిందితుడు. ఎప్స్టీన్‌కు శిక్ష పడిన తర్వాత కూడా (2011లో) బిల్ గేట్స్ ఆయనను కలిశారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్స్ గేడ్స్ ఇద్ద‌రు ర‌ష్య‌న్ బాలిక‌ల‌తో ఉన్న ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. దీనిపై గేట్స్ ఫౌండేషన్ స్పందిస్తూ.. సేవా కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ కోసమే ఎప్స్టీన్‌తో పరిమితంగా సంప్రదింపులు జరిగాయని, ఆయనతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని గతంలోనే స్పష్టం చేసింది.

గేట్స్‌కు రెడ్ కార్పెట్ ప‌రిచిన చంద్ర‌బాబు
వివాదాలు ఒకవైపు ఉన్నా, బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యం, వ్యవసాయం, ఐటీ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు ప్ర‌ముఖంగా వినిపించిన‌ప్ప‌టికీ, బాలిక‌ల‌తో లైంగిక సంబంధాలు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు తీవ్రంగా వినిపిస్తున్న‌ప్ప‌టికీ ఏపీలోని చంద్ర‌బాబు స‌ర్కార్ బిల్ గేట్స్‌కు రెడ్ కార్పెట్ ప‌రిచి సాద‌ర స్వాగ‌తం ప‌ల‌క‌డంపై గ‌తంలోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఎంఈఏ ప్ర‌క‌ట‌న అంతర్జాతీయంగా ప్రముఖులపై వచ్చే ఆరోపణల ప్రభావం దౌత్యపరమైన సంబంధాలపై ఎలా ఉంటుందనే దానికి ఈ పరిణామం ఒక ఉదాహరణగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment