బీహార్ ప్రజలు సీఎంగా తేజస్విని చూడాలనుకుంటున్నారా?

బీహార్ ప్రజలు సీఎంగా తేజస్విని చూడాలనుకుంటున్నారా?

బీహార్‌ (Bihar)లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో, ఇటీవల నిర్వహించిన ఒక సర్వే (Surveyలో ముఖ్యమంత్రి (Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) కు ప్రజాదరణ తగ్గినట్లు వెల్లడైంది. స్టేట్ వైడ్ సర్వే ఆఫ్ బీహార్ ఎలక్షన్స్ 2025 ప్రకారం, కేవలం 25 శాతం మంది మాత్రమే నితీష్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు.

ఈ సర్వేలో ఆర్జేడీ (RJD)  నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 32.1 శాతం మంది ప్రజలు ఆయనను తదుపరి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని సర్వే తెలిపింది. ముఖ్యంగా, ముస్లింలలో దాదాపు 50 శాతం మంది తేజస్వి వైపు మొగ్గు చూపారు.

ప్రజాదరణలో నితీష్‌ వెనుకబడినా..
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏ కూటమిని ప్రజలు విశ్వసిస్తున్నారనే ప్రశ్నకు, మహాఘట్‌బంధన్‌కు 36.1 శాతం మంది, ఎన్డీఏకు 35.4 శాతం మంది మద్దతు తెలిపారు. ఈ ఫలితాలు కూటముల మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి.

నితీష్ కుమార్ ప్రజాదరణ తగ్గడంతో, కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. నితీష్ చాలాసార్లు సీఎంగా పనిచేసినందున, కొత్త అభ్యర్థిని నిలబెడితే విజయం సాధించవచ్చని ఎన్డీఏ భావిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారనేది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment