తెలుగులో బిగ్ బాస్ (Bigg Boss) తీసుకుంటున్న నిర్ణయాలు రోజురోజుకు మరింత వివాదాస్పదమవుతున్నాయి. గతంలో కొంత గుర్తింపు, నటన సామర్థ్యం ఉన్నవారిని హౌస్(House)లోకి తీసుకువచ్చేవారు, అది ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా వివాదాలు (కాంట్రవర్సీలు) (Controversies) ఉన్నవారికే బిగ్ బాస్ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇది ప్రేక్షకులకు అసహ్యంగా అనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో రీతూ చౌదరి (Rithu Chowdary), సంజన (Sanjana) వంటి వారిపై అనేక వివాదాలు ఉన్నప్పటికీ, వారిని హౌస్ నుంచి పంపకుండా ఉంచడంపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి.
తాజాగా, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ముఖ్యంగా, ‘అలేఖ్య చిట్టి పికిల్స్'(Alekya Chitti Pickles)వివాదంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన రమ్య మోక్షను హౌస్‌లోకి తీసుకువచ్చారు. ఆమెకు తోడుగా, ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద వివాదాలకు కేంద్ర బిందువైన దివ్వెల మాధురిని తీసుకురావడంపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి.
దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతురు ఇప్పటికీ మాధురిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. లక్షల మంది వీక్షించే ఈ షోకి, సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది? హౌస్‌లోకి ఎలాంటి వారిని తీసుకువస్తున్నామనే కనీస బాధ్యత లేదా? అంటూ ప్రేక్షకులు, విమర్శకులు బిగ్ బాస్ షో నిర్వహణపై తీవ్రంగా మండిపడుతున్నారు.








