తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదపారాయణదారుల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయడం దారుణంగా ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ హయాంలో వేదపారాయణదారుల సంఖ్యను పెంచి వేదపారాయణం విశ్వవ్యాప్తం చేయాలని బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు ఉద్దేశపూర్వకంగా ఆ ఇంటర్వ్యూలను నిలిపివేశారు అని ఆయన ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన బి.ఆర్.నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈరోజు ప్రారంభం కావాల్సిన వేదపారాయణ ఇంటర్వ్యూలను మరే కారణమేమీలేకుండా చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆపివేశారని, పొద్దుపరుగులేని విధానంగా డిప్యూటీ ఈవో గోవిందరాజన్ ఆధ్వర్యంలో, అలాగే కృష్ణయజుర్వేద ఫణియజ్జేశ్వర్ యాజుల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. “700 మంది వేదపారాయణదారులు ఎంపికైనపుడు పెద్ద మార్పు జరుగుతుంది అని మేమే భావించాము. ఆ సంకల్పాన్ని ప్రస్తుత చైర్మన్ ఇబ్బంది పెట్టడం మంచిదికాదు. ఇది బ్రాహ్మణ సమాజానికి ఆవేదన కలిగించే చర్య” అని భూమన మండిపడ్డారు.
టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆరు మంది బ్లాక్ మెయిలర్స్ తో తనపై నిఘా పెట్టారని, ఆరు మంది కాదు.. ఆరు వందల మందిని నియమించినా తాను భయపడేదిలేదన్నారు భూమన. చేస్తున్న తప్పులను ఎత్తి చూపే బాధ్యత తమదని, ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు.