బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచ‌న‌

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచ‌న‌

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 24 గంటల్లో ఇది ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్ప‌పీడ‌నం కార‌ణంగా రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేసింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తీర ప్రాంతాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అలాగే, రాష్ట్ర మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

గాలుల వేగం 60కి.మీ.కి చేరే అవకాశం
తీరం వెంబడి గంటకు 60కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా హెచ్చరించారు. ఈ ప్రభావం వల్ల సముద్రతీరం వెంబడి ఉండే ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే ప్రయాణాలు చేయాల‌ని, తీర ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ సూచనలను అనుసరించాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడ‌ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment