హైదరాబాద్‌లోకి బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటు – 20 మంది అరెస్టు

హైదరాబాద్‌లోకి బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటు - 20 మంది అరెస్టు

హైదరాబాద్ (Hyderabad) నగరంలోకి పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు (Bangladeshis) అక్రమంగా చొరబడ్డారు. నగర శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు(Arrest) చేసిన వారిని తెలంగాణ (Telangana) పోలీసులు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) (BSF)కు అప్పగించారు.

గతంలో కూడా హైదరాబాద్‌లో చాలాసార్లు బంగ్లాదేశ్ వలసదారులను పోలీసులు పట్టుకున్నారు. వారిని ఎప్పటికప్పుడు బీఎస్ఎఫ్ కు అప్పగిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా భారతదేశానికి అక్రమ వలసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలోకి వస్తున్న వలసదారులపై సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసి అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment