బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థనను పంపింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
భారత్‌లో అమలులో ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం ప్రకారం, షేక్ హసీనాను అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ కోరింది. ఆమె పరిపాలనా కాలంలో జరిగిన అల్లర్లు, హత్య కేసులలో అభియోగాలు నమోదు కావడంతో, న్యాయపరమైన ప్రక్రియను కొనసాగించడమే ఈ అభ్యర్థన లక్ష్యంగా ఉందని సలహాదారు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా.. 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి షేక్ హసీనా ఆగస్టు 5వ తేదీన ఆ దేశాన్ని వీడింది. నేరుగా భారత్ కు వచ్చి ఆమె ఆశ్రయం పొందుతోంది.